ఒకవైపు కరోనా సబ్ వేరియంట్లతో ఇబ్బందులు మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇంకా గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారు అధికమవుతున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఉప్పు మోతాదు పెంచితే అనారోగ్య సమస్యలు వస్తాయని.. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వస్తాయని నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలి.