డబ్బును దొంగలించాడు.. కేరళ యువకుడి చేతులు నరికేయండి...

శుక్రవారం, 17 మే 2019 (16:57 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన యువకునికి సౌదీ అరేబియా కఠిన శిక్షను జారీ చేసింది. సౌదీలోని హోటల్‌లో ఓ యువకుడు ఆరేళ్ల పాటు పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక లక్ష రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి ఆ హోటల్‌లో పనిచేసే యువకుడే కారణమని నిర్ధారణ అయ్యింది. దీంతో సౌదీకి ఆ యువకుడిని మరో వ్యక్తి తీసుకెళ్లాడు. 
 
దొంగలించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని సదరు యువకుడు హామీ ఇచ్చాడు. కానీ డబ్బు ఇవ్వకుండా సాకులు చెప్పసాగాడు. దీంతో విసిగిపోయిన వ్యక్తి.. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతని గదిలో జరిపిన తనిఖీల్లో దొంగలించిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు.  
 
దీనిపై కోర్టులో విచారణ జరిగింది. విచారణలో హోటల్‌లో ఆ యువకుడు దొంగలించిన మాట వాస్తవమేనని తేలింది. ఫలితంగా సౌదీ చట్టం ప్రకారం ఆ యువకుడి చేతులను నరకాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన సౌదీలో పెను సంచలనం సృష్టించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు