ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే ఆరోపణలతో గత ఏడాది జూన్‌లో సౌదీ అరేబియాతో పాటు బెహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న నేపథ్యంలో రష్యా క్షిపణులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఖతర్‌కు సౌదీ అరేబియా హెచ్చరికలు జారీ చేసింది. అదే కనుక జరిగితే సైనిక చర్య తప్పదని హెచ్చరించింది.
సౌదీ తెగతెంపులు చేసుకోవడంతో ఒంటరిగా మారిన ఖతర్.. రష్యా వంటి కొత్త స్నేహితులకు దగ్గరైంది. ఈ జనవరిలో రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ మిసైల్ సిస్టంను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. దీంతో ఫైర్ అయిన సౌదీ.. సైనిక చర్య తప్పదని హెచ్చరించింది. క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.