అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమేజ్ ఎడమ తొడపై 'ఓం' టాటూ

శనివారం, 7 మే 2016 (13:21 IST)
సినీనటుల నుండి సామాన్యుల వరకు... ప్రపంచ దేశంలో టాటూలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. అయితే ఈ టాటూస్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేయించుకుంటారు. మన భారతీయ నటుల్లో త్రిష, అమలా పాల్ పచ్చ వేయించుకుని సంచలనం సృష్టించారు. ఇక హాలీవుడ్ నటీమణులైతే వీరని మించిపోయారు. కొందరైతే సీక్రెట్ ప్లేస్‌లో కూడా టాటూస్ వేయించుకుంటున్నారు. 
 
అక్కడ.. ఇక్కడా అని తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకుని సినీనటులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఫ్యాషన్ కోసం పచ్చబొట్టు సింబల్స్ వేయించుకుంటే పర్వాలేదు కానీ.. మతవిశ్వాసాలను కించపరిచేలా టాటూలు వేసుకుంటున్నారు. 
 
అసలు విషయం ఏంటంటే ఎప్పుడూ కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసే అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమేజ్ తన ఎడమ తొడపై భాగంలో హిందువులకు అతి పవిత్రమైన ఓం గుర్తును టాటూగా వేయించుకుంది. 'ఓం'.. ఎంతో ప‌విత్రమైన.. అకార.. ఉకార.. మ‌కార సంగమ క్షేత్రం. 
 
హిందూ స‌మాజాన్ని కించపరిచే విధంగా ఓంకారాన్ని అప‌హాస్యం పాలు చేసింది. ఫోటో షూట్‌లలో బయటకు రావడంతో అమెరికాలో ఉన్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలీనా ఇలా చేయ‌డం తమ మ‌తాన్ని కించపర‌చ‌డ‌మేన‌ని యావ‌త్ హిందూ స‌మాజం నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి