వెనెజులాకి చెందిన మిచెల్లీ లెవిన్ అనే 32 ఏళ్ల ఫిట్‌నెస్ మోడల్ బహమాస్‌లో గల బిగ్ మేజర్ కే ద్వీపంలో బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటోంది. అయితే ఆ ప్రాంతంలో పందులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ పందుల గుంపు ద్వీపం చుట్టూ ఉన్న నీళ్లలో ఈత కొడుతూ, వచ్చేపోయే టూరిస్ట్‌లను ఆకర్షిస్తూ ఉండేవి. అంతేకాకుండా వచ్చిన సందర్శకులు సైతం వాటితో ఫోటోలు తీసుకునేవారట.
మిచెల్లీ బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటున్న సమయంలో పందుల గుంపు ఒకటి ఆమె వైపుకు వేగంగా వచ్చాయట. వాటిని చూసి పరుగు పెట్టినప్పటికీ, అందులో భారీ ఆకారంలో ఉన్న పంది ఒకటి ఆమె ధరించిన బికినీ కుడివైపు ప్రదేశాన్ని బాగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని లెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కేవలం ఒక్క రోజులో దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఈ ఘటనను చూసిన కొందరు నెటిజన్లు... పంది మీ అందానికి ఫిదా అయి అలా చేసి వుంటుందిలే అని సెటైర్లు పేలుస్తున్నారు.