దుండగుల వయసు 20-30 ఏళ్ల మధ్యలో ఉంటుందని ఖల్సా తెలిపారు. దాడి ఘటనపై సిక్కు సంఘాలు రిచ్‌మండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుండగులపై జాతి విద్వేష దాడి కింద కేసు నమోదు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.