మగవాళ్లతో నగ్నంగా డ్యాన్సులు-మోడల్స్‌పై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

శనివారం, 30 జులై 2022 (19:14 IST)
మోడల్స్‌పై దోపిడి ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీలకు పాల్పడే ముఠా ఎనిమిదిమంది మోడల్స్‌పై అత్యంత పాశవికంగా.. క్రూరంగా అత్యాచారానికి తెగబడ్డారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్‌ వీడియోకు సంబంధించి పలువురు మోడల్స్‌తో షూట్‌ చేస్తుండగా.. మారణాయుధాలతో కొంతమంది ఆ ప్రాంతానికి చొరబడ్డారు. అక్కడ ఉన్న మోడల్స్‌పై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డారు.  వారి ఇష్టానురీతిగా వ్యవహరించి పైశాచిక ఆనందం పొందారు.
 
నిందుతులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్‌ పోలీసులు.. అక్రమ మైనింగ్‌ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని.. వారు తరచూ దోపిడీలకు పాల్పడతారని తెలిపారు.  
 
అత్యాచారానికి గురి అయిన మోడల్స్ 18 నుంచి 35 ఏళ్ల మధ్యవారే. షూటింగ్‌లో ఉన్న మగవాళ్లతో నగ్నంగా డ్యాన్సులు చేయించి ఆపై అక్కడున్నవారి నంచి డబ్బు, నగలు దోచుకుపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో 67 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు