ఇంధనం కొరత.. రోజుకు పది గంటలు కరెంట్ కోత.. ఎక్కడ?

గురువారం, 31 మార్చి 2022 (14:24 IST)
electricity
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కొరత వల్ల నేటి నుంచి కరెంటు కోతల సమయాన్ని రోజుకు 10 గంటలకు పెంచాలని నిర్ణయించింది ఆ దేశ ప్రభుత్వం.
 
ఇప్పటికే ఇంధన కొరత వల్ల ప్రజలు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో సరిపడా ఇంధనం లేని కారణంగా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది.  దేశంలో ప్రస్తుతం 750 మెగా వాట్ల విద్యుత్ కొరత ఉందని ప్రభుత్వం తెలిపింది. 
 
బుధవారం (మార్చి 30) నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (పవర్​ కట్​) భావిస్తోంది.
 
ఇంధన ధరలు పెరిదిపోవడంతో పాటు కొరత కారణంగా పెట్రోల్​ బంకుల ఎదుట వాహనాదారులు గంటల తరపడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా.. గంటల తరబడి కరెంటుకోతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నెల ఆరంభంలో కరెంటు కోతలు రోజుకు 7 గంటలుగా ఉంటే.. తాజాగా ఆ సమయాన్ని 10 గంటలకు పెంచింది ప్రభుత్వం. థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పబ్లిక్ యుటిలిటీ కమిషనర్​ జనక రత్నాయక చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు