శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

బుధవారం, 20 జులై 2022 (13:15 IST)
శ్రీలంక దేశ కొత్త అధ్యక్షుడుగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో రణిల్ విక్రమసింఘేను కొత్త దేశాధ్యక్షుడుగా ఎన్నికున్నారు. గత 40 యేళ్ళ కాలంలో పార్లమెంట్ ద్వారా లంకాదేశ కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకను వదిలి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దొంగచాటుగా పారిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. 
 
మొత్తం 225 ఓట్ల శ్రీలంక పార్లమెంట్‍‌లో 223 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. వీరిలో రణిల్ విక్రమసింఘేకు 134 మంది మద్దతు తెలుపగా, ఈ పదవి కోసం పోటీపడిన దుల్లాస్‌కు 82, దిసనాయకేకు 3 ఓట్లు చొప్పున పోలయ్యాయి. దీంతో విక్రమసింఘే దేశ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కాగా, రణిల్ విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు విధులు నిర్వహించడం గమనార్హం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు