శ్రీలంకలో భారతీయ ఉన్నతాధికారిపై దాడి

బుధవారం, 20 జులై 2022 (08:03 IST)
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను గట్టెక్కించేందుకు ఆ దేశ పాలకులు అన్ని రకలా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితులు చక్కబడటం లేదు. పైగా, పరిస్థితులు మరింతగా దిగజారిపోతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సీనియర్ అధికారిపై దాడి జరిగింది. 
 
భారత వీసా కేంద్రం డైరెక్టరుగా ఉన్న వివేక వర్మపై సోమవారం రాత్రి కొలంబో సమీపంలో గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు భారత హైకమిషన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడి ఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలోని భారతీయులు తాజా పరిణామాలను ఎప్పటికపుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తమ ప్లాన్ చేసుకోవాలని భారత ప్రభుత్వం కోరింది. అత్యవసర సమయాల్లోనే తమను సంప్రదించాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు