శ్రీదేవి కేసు క్లోజ్ : ఎంబాల్మింగ్ సెంటర్‌కు శ్రీదేవి మృతదేహం (వీడియో)

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (16:33 IST)
నటి శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు క్లోజ్ చేశారు. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లోపడి మరణించినట్టు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీసుకు సమాచారం చేరవేశారు. ఇదే విషయాన్ని దుబాయ్ మీడియా ఆఫీస్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ల రూపంలో వెల్లడించింది. 
 
ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్ హోటల్‌లో శ్రీదేవి మరణించిన విషయం తెల్సిందే. ఆమె మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ కేసు దాదాపు 60 గంటల పాటు ఎన్నో మలుపుల మధ్య ఎంతో ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ మొత్తం పూర్తయినట్లు పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ప్రమాదవశాత్తు మృతి కేసును మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ఎంబాల్మింగ్ సెంటర్‌కు తరలించేందుకు అనుమతి ఇచ్చారు.
 
దీంతో మంగళవారం మధ్యాహ్నం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాస్తవానికి సోమవారమే ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. దాని ప్రకారం దుబాయ్ పోలీసులు ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వాళ్లు తదుపరి విచారణను పూర్తిచేశారు. ఆమె మృతి ప్రమాదవశాత్తూ జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత కేసును మూసేస్తున్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ స్పష్టంచేసింది. 

 

Sridevi's body is enroute to the embalming centre

Track LIVE updates here >> https://t.co/oXakxtOGjk pic.twitter.com/EztDpFU58J

— Khaleej Times (@khaleejtimes) February 27, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు