సినీతార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో శనివారం రాత్రి శ్రీదేవి కన్నుమూశారు. అయితే ఇప్పటివరకు శ్రీదేవి భౌతికకాయం దేశానికి చేరుకోలేదు. శ్రీదేవి మృతివెనుక కారణాలు వెలికి తీస్తున్న పోలీసులు, దర్యాప్తు పూర్తయ్యేంతవరకు శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు పంపే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే బోనీకపూర్‌ను విచారించిన పోలీసులు.. శ్రీదేవి మృతిపై నిజాలేంటనే దానిపై ఆరాతీస్తున్నారు. ఎంబాలింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అన్ని సందేహాలు తీరిన తరువాతే ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తామని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భారత రాయబార కార్యాలయానికి దుబాయ్ పోలీసులు సమాచారం అందించినట్లు వినికిడి.