అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన జాత్యంహకారి ఆడమ్ ప్యూరింటన్‌కు ఉరి శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. ఆయనపై మోపిన హేట్ క్రైమ్, మర్డర్ అభియోగాలు రుజువు కావడంతో ఈ శిక్షను కోర్టు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గత ఫిబ్రవరి 22న బార్‌లో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య అమెరికాలో కలకలం సృష్టించింది. జాతి పేరుతో దూషిస్తూ ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి బార్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించగా ఆయన స్నేహితుడు అలోక్‌కు గాయాలు అయ్యాయి. జాత్యంహకారి దూషణలను అడ్డుకున్న మరో అమెరికన్‌పై కూడా ప్యూరింటన్ కాల్పులు జరిపాడు.
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జాత్యంహకార దాడులకు ఇది పరాకాష్ట. కూచిబొట్ల హత్య జాత్యంహకార దాడేనని స్వయంగా అమెరికా చట్టసభలే అంగీకరించాయి. స్వయాన ట్రంపే ఈ దాడిని ఖండించారు. కూచిభొట్ల భార్య సునయను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆశయాలను తాను నెరవేరుస్తానని ఆమె చెప్పారు. కూచిబొట్ల కేసు విచారణ తుది దశకు చేరుకుంది.