అయితే, ఈ నిధిలో కొంత భాగం సముద్రంలో కనుగొన్నారు. సముద్రం కింద ఇంకా మరిన్ని వస్తువులు ఉండవచ్చని నిధి వేటగాళ్లు పేర్కొన్నారు. 360 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ ఓడను కనుగొనడం చాలా సవాలుగా మారింది. ఈ ఓడ బరువు సుమారు 891 టన్నులు. విమానంలో 650 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 45 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారట.
జులై 2020లో వాకర్స్ కే ఐలాండ్ సమీపంలో విలువైన కళాఖండాల కోసం వెతకడం ప్రారంభించినట్లు కార్ల్ అలెన్ చెప్పుకొచ్చాడు. ఈ ద్వీపం బహామాస్‌కు ఉత్తరాన ఉంది. దీని కోసం హై రిజల్యూషన్ మాగ్నోమీటర్లు, జీపీఎస్, మెటల్ డిటెక్టర్లను ఉపయోగించారు.
వెండి, బంగారు నాణేలు..
కార్ల్ అలెన్ ఓడను వెతకగా, పచ్చ, నీలమణి, ఫిరంగి వంటి రత్నాలు, 3000 వెండి నాణేలు, 25 బంగారు నాణేలు దొరికాయని తెలిపాడు. చైనీస్ పింగాణీ, ఇనుప గొలుసులు కూడా దొరికాయి.