కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సెకెండ్ ఎడిషన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ, ఈసీబీ (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) గుడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ సెకెండ్ మ్యాచ్‌ల కోసం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇందుకు యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దాంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్.. యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు.
ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబురు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని పేర్కొన్నారు.