మళ్లీ బయటపడిన చైనా బుద్ధి... పాకిస్తాన్‌తో యుద్ధం వద్దంటూ...

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:13 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ప్రతి దాడులు నిర్వహించడంతో సాయం చేయమన్న పాకిస్థాన్ అభ్యర్థనను చైనా తిరస్కరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మద్దతు రోజురోజుకీ పెరుగుతుండటంతో ఈ సమయంలో పాకిస్థాన్‌కు సహాయం చేస్తే తమ దేశానికే నష్టం అని భావించిన చైనా వారికి సహాయాన్ని తిరస్కరించడమే కాకుండా ఇప్పుడు శాంతి పాఠాలు బోధిస్తోంది.
 
పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో చైనా మొదటిసారిగా స్పందించింది. "భారత్ పాకిస్థాన్ సంయమనం పాటించాలని కోరుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితి తిరిగి గాడిన పడుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగుపడతాయని" చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ పేర్కొన్నారు.
 
అయితే ఎప్పుడూ పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడే చైనా ఈ విషయంలో భారత్‌కు సానుభూతిని ప్రకటించకపోగా పాకిస్థాన్‌తో యుద్ధం వద్దు అని మాట్లాడుతుండటం చూస్తుంటే చైనా బుద్ధి బయటపడుతోందని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు