భారత్ పైన దాడికి సపోర్ట్ కావాలి ప్లీజ్... డ్రాగన్‌కి ఫోన్ చేసిన పాక్...

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:47 IST)
భారత్ వైమానిక దాడులతో పాకిస్థాన్‌కి కునుకు లేకుండా చేసినట్లుంది. ఇవాళ ఉదయం జరిగిన యుద్ధ విమానాల దాడులతో పాక్ వణికిపోయింది. అలెర్ట్ అయిన పాకిస్థాన్ తనకు అత్యంత సన్నిహిత స్నేహబంధాన్ని కలిగి ఉన్న డ్రాగన్ దేశానికి ఫోన్ చేసి సాయం అందించవలసిందిగా కోరింది. భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కి వెళ్లిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వీకి ఫోన్ చేసారు. 
 
ఇదే విషయాన్ని చైనా ప్రభుత్వరంగ అధికారిక వార్తా సంస్థ క్సిన్హువా స్వయంగా వెల్లడించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని ఖురేషి చైనాకు ఫిర్యాదు చేసారు. భారత్‌పై తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరితే, చైనా అందుకు అంగీకరించలేదని సమాచారం. 
 
భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్‌ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు వాటికి దీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆ దేశ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఉదయాన్నే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. భారత్ చేస్తున్న దాడులతో మొత్తమ్మీద పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు