ఆధునిక యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో సంసారం చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గంటల పాటు ఆఫీసుల్లో గడిపి.. ఆపై ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడిపేవారు పెరిగిపోతున్నారు. దీంతో కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి.
దంపతుల మధ్య ప్రేమ కొరవడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య కొరవడుతున్న ప్రేమ, అప్యాయత, వ్యక్తిగత సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు స్వీడన్ దేశానికి చెందిన ఓ కౌన్సెలరు వినూత్న సలహా ఇచ్చాడు.