ఉక్రెయిన్‌లా మార్చేయకండి.. ప్రపంచ దేశాలను సాయం కోరుతున్న తైవాన్

బుధవారం, 10 ఆగస్టు 2022 (22:01 IST)
Taiwan
ఉక్రెయిన్‌‌లా తమ దేశాన్ని మార్చేయవద్దని.. ప్రపంచ దేశాలను తైవాన్ సాయం కోరింది. తైవాన్ స్వతంత్ర దేశంగా పనిచేయడాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తైవాన్ ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించింది. 
 
చైనా పొరుగు దేశమైన తైవాన్‌ను ఇతర దేశాలు ప్రత్యేక దేశంగా గుర్తించినప్పటికీ, చైనా తైవాన్‌ను చైనా స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా పరిగణిస్తుంది.
 
తాజాగా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో తైవాన్ చుట్టూ సైనిక బలాన్ని పెంచుకుంటున్న చైనా కూడా సైనిక విన్యాసాలలో నిమగ్నమైంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు తైవాన్‌లో సరిహద్దుల గుండా ఎగురుతున్నాయని తరచూ ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగించినట్లే, తైవాన్‌పై కూడా చైనా తన యుద్ధాన్ని ఎప్పుడు కొనసాగిస్తుందోననే టెన్షన్‌ నెలకొంది. 
 
ఈ సందర్భంలో చైనా సైనిక విన్యాసాలను నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తైవాన్ ప్రకటించింది. 
 
అంతేగాకుండా.. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతును తైవాన్ అభ్యర్థించింది. మరోవైపు ఇప్పటికే చైనా యుద్ధ విన్యాసాలను అమెరికా ఖండించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు