ఉపాధ్యాయ వృత్తికే ఆ ఉపాధ్యాయురాలు కలంకం తెచ్చింది. విద్యార్థులతో పాటు ఫూటుగా మందు కొట్టింది. అంతటితో ఆగకుండా ఓ విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. ఈ ఓహియోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జెస్సికా స్టోరర్ అనే 28 ఏళ్ల యువతి ఓ స్కూల్లో తాత్కాలిక టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు వివాహం కూడా అయ్యింది. భర్త పేరు డెర్రిక్.
ఈ నేపథ్యంలో ఇటీవల జెస్సికా ఇంట్లో జరిగిన ఓ పార్టీకి కొంతమంది విద్యార్థులను ఆహ్వానించారు. ఈ పార్టీలో విద్యార్థులకు మందు పార్టీ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్యం వద్దని వారించాల్సిన టీచర్ తాను కూడా వారితో కలిసి చుక్కేసింది. ఆ తర్వాత 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఇది తెలిసి కూడా జెస్సికా భర్త వద్దని వారించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.