పది రూపాయ గొడవ.. చివరికి ఒకరి ప్రాణాలు తీసేసింది!

బుధవారం, 28 జనవరి 2015 (15:58 IST)
పది రూపాయల విషయంలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానై ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. ముంబైలో పది రూపాయల నాణెం ఓ వ్యాపారి ప్రాణం తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ముంబైలో ఫిరోజ్ షేక్ (35) అనే వ్యక్తి చికెన్ షాపు వ్యాపారి. మంగళవారం కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహు అనే ముగ్గురు వ్యక్తులు ఈ షాపుకు చికెన్ కొనడానికి వచ్చారు. 105 రూపాయల విలువ చేసే చికెన్ కొనుగోలు చేశారు.
 
అయితే ఫిరోజ్ షేక్ ఉద్దేశపూర్వకంగా తీసుకున్నాడో, పొరపాటున తీసుకున్నాడో గానీ పదిరూపాయలు ఎక్కువగా 115 రూపాయలు తీసుకున్నాడు. దాంతో ఫిరోజ్‌కి అక్కడకి వచ్చిన ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆ ముగ్గురూ ఫిరోజ్ మీద దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టడంతో ఫిరోజ్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. దీంతో పోలీసులు కేసులు కేసు నమోదు చేసి ఈ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి