అమ్మకు క్యాన్సర్.. బిడ్డను కూడా ఆ ప్రాణాంతక మహమ్మారి వదిలిపెట్టలేదు. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే బిడ్డ ఆమె వెంటే వెళ్లిపోయాడు. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న లండన్‌లోని ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంది. శుక్రవారం అమ్మతో పాటు శాశ్వతంగా ఈ లోకానికి దూరమైన ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు చివరి కోరిక ఏంటో వింటే కంట నీరు రాక తప్పదు.
2011తో ఫిలిప్ తల్లి ఎజ్నియెస్కా కూడా కేన్సర్‌తోనే మృతి చెందారు. తండ్రి పీటర్‌తో కలిసి ఉంటున్న ఫిలిప్‌కు కేన్సర్ సోకినట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. బాలుడికి సోకిన జువెనైల్ మైలోమోనోసైటిక్ ల్యుకేమియా(జేఎంఎంఎల్) నుంచి రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలుడి కోరిక తీర్చేందుకు 6500 పౌండ్లు అవసరం కాగా, దాతల ద్వారా 41వేల పౌండ్లు విరాళంగా అందాయి.