కరోనా వైరస్ ధాటికి విలవిలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 2,82,500 మంది మృతి చెందగా, అమెరికాలోనే 82 వేలకు పైగా మరణించారు. ప్రపంచంలో సుమారు 42 లక్షమంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
మొత్తంగా 2,21,344 మంది వైరస్ బారిన పడగా, 2 వేలకు పైగా మృతి చెందారు. యూరప్‌లో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన స్పెయిన్, ఫ్రాన్స్‌ల్లోనూ నిబంధనలను క్రమంగా తొలగించడం ప్రారంభించారు.