కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి. కరోనా నివారణ చర్యలు, రైతుల సమస్యలపై గవర్నర్ తో చర్చించినట్లు తెలిపారు.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు ఉత్తమ్. టెస్టింగ్ సామర్థ్యము ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదన్నారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు కూడా ఎక్కువ కరోనా టెస్ట్ లు చేస్తుందని.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టెస్ట్ లు చేయడం లేదన్నారు.
ముఖ్యమంత్రి వైఖరి ఆన్ సైoటిఫిక్ గా ఉందని, ఏక పక్ష ధోరణితో ప్రభుత్వ పెద్దలు వెళ్తున్నారని తెలిపారు.
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేస్తున్నారో చెప్పాలని తెలంగాణ కరోనా ఫ్రీ కావాలని కోరుకుంటున్నామని తెలిపారు ఉత్తమ్.
తెలంగాణలో మరణాలు చూపెట్టడం లేదని చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రతి బిపిఎల్ కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలని కోరామన్నారు.
నిరుపేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశామన్నారు. 26 మార్చి రోజు కేజీ కంది పప్పు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారని.. కానీ ఇప్పటి వరకు కంది పప్పు ఇవ్వలేదన్నారు.
ఎంతమంది వలస కూలీలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవని..వలస కూలీలు వెళ్ళిపోతే … తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. వలస కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు ఉత్తమ్.
బస్తాలు లేక వరి ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని, అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిందన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
హమాలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలన్న ఉత్తమ్.. కందుల పైసలు రైతులకు ఇంకా ఇయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్…రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.