టెక్సాస్‌లో కారు ప్రమాదం: ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:25 IST)
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున టెక్సాస్‌ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్య ఆవుల (34), రాజా గవిని (41), ప్రేమ్‌నాథ్‌ రామనాథం (42)  మృతి చెందినట్టు ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. 
 
ఎఫ్‌ ఎం 423 ఇంటర్‌సెక్షన్‌ వద్ద అతి వేగంగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. దివ్య ఆవుల కారును నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

వీరు ముగ్గురు ప్రిస్కోలోనే నివసిస్తున్నారు. ఈ ఘటనపై ఫ్రిస్కో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు