వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్ పట్టణంలోని క్లాక్‌టవర్ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా... దాదాపు 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్‌కు పర్యాటకులు పెద్దమొత్తంలో విచ్చేశారు. మృతుల్లో కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.