ఉగ్రవాదులను పెంచి పోషించడంలో ముందున్న పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసింది భారత్. ఈ విషయంలో నరేంద్ర మోడీ సర్కారు విజయం సాధించిందనే చెప్పాలి. సార్క్ సమావేశాలను బహిష్కరించడంలో తన దేశంతో పాటు ఇతర ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులను కూజా మోడీ ప్రభుత్వం ప్రభావితం చేయగలిగింది.
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్‌లో సార్క్ సదస్సు జరగడం శ్రేయస్కరం కాదని, తమతో పాటే మిగతా అన్ని దేశాలు కలిసివచ్చేలా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో పాకిస్థాన్ సార్క్ సదస్సుకు పాక్ సర్కారు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణాసియాలో పాకిస్థాన్ ఏకాకిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పాక్‌లో జరగాలని నిర్ణయించిన సార్క్ సదస్సు జరగకపోవడంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సార్క్‌లోకి చైనా, ఇరాన్, మధ్య ఆసియా రిపబ్లిక్ దేశాలను కూడా చేర్చుకోవాలని పాకిస్థాన్ కోరుతోంది. తద్వారా భారత్ హవాకు చెక్ పెట్టాలని నవాజ్ సర్కారు తీవ్రంగా యత్నిస్తోంది.