లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా ట్రంప్ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు యాహూ న్యూస్ తెలిపింది. న్యూమరాలజిస్టులు లైఫ్ పాత్ నంబర్, మాస్టర్ ఇయర్ ఆధారంగా జాతకాలు చెబుతారు.
లైఫ్‌పాత్ నంబర్ అంచనా
ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్ అనికూడా అంటారు. ట్రంప్ బర్త్‌డేట్: 14–06–1946. ఇందులో అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్ లైఫ్‌పాత్ నంబర్. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులు మాస్టర్ బిల్డర్స్ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.
వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువని తెలిపారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్ బర్త్‌డేట్: 20–11–1942. ఇందులో అంకెలను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది.
ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్ ఇయర్ అని వివరించారు.