ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నారు. తాజాగా మరో ఐదున్నర వేల మందికి ఆయన ఉద్వాసన పలికారు. అమెరికాతో సహా పలు దేశాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించారు.
తాజాగా ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగించారు. దాదాపు 5500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది.
కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో యాక్సెస్ కోల్పోయిన తర్వాత ఉద్యోగం కోల్పోయామనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించారు. మరికొందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈమెయిల్స్ ద్వారా సమాచారం చేరవేశారు.