ఐఎస్‌ అంతమే ఒబామా లక్ష్యం.. గత వేసవి నుంచి ఇప్పటివరకు ఒక్కదాడిలోనూ నో సక్సెస్..!

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (13:19 IST)
అరబ్ దేశాలతో పాటు 66 సభ్యులుగా ఉన్న సంకీర్ణ కూటమి ఐఎస్ ఉగ్రవాదుల్ని నాశనం చేసేందుకు సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఐఎస్ ఉగ్రవాద నాయకులు ఆత్మరక్షణలో పడ్డారని ఒబామా వెల్లడించారు.  చమురు ద్వారా ఉగ్రవాదులకు వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించామన్నారు.

సిరియా సంక్షోభానికి ముగింపు పలకాలంటే ఇస్లామిక్ స్టేట్ సంస్థను అంతం చెయ్యడం ఒక్కటే మార్గమని ఒబామా పేర్కోన్నారు. దీని కోసం అమెరికా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన వివరించారు. 
 
అమెరికాలోని సీఐఏ హెడ్ క్వాటర్స్‌లో భద్రతాధికారుల సమావేశానికి అనంతరం ఒబామా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అమాయక ప్రజలను, పిల్లల్ని లక్షంగా చేసుకుని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా దాడులు చేశారని ఒబామా విచారణం వ్యక్తం చేశారు.

ఇలాంటి దాడుల ద్వారా ఐఎస్ఐఎస్ తనంతట తానే బలహీనపడుతుందోని ఒబామా అన్నారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 
 
అయితే గత వేసవి నుంచి ఇప్పటి వరకు ఒక్క దాడిలోనూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విజయవంతం కాలేదన్నారు. ఐఎస్ఐఎస్ ఆర్థిక మూలాల్ని దిగ్బంధించడాన్ని ఇక ముందు కూడా దాడులు కొనసాగిస్తామని ఒబామా స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి