ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధభూమిలోకి దిగారు. ఆయన ఒక సైనికుడుగా మారిపోయారు. తమ దేశంపై బాంబులు కురిస్తున్న రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేసే పనిలో నిమగ్నమయ్యారు.
రష్యా ఫైటర్ జెట్లు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో తమ దేశ సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేందుకు అధ్యక్షుడు సైనికుడిగా మారిపోయారు. సైనిక దుస్తులు ధరించి యుద్ధభూమిలోకి వచ్చారు.
రష్యా బలగాలు దాడులు చేసిన ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు తీసిన వీడియోలను ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఉక్రెయిన్ అధినేత ఒక సైనికుడుగా కనిపిస్తున్నారు.
ఓ వైపు బాంబులతో రష్యా దాడులు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం భయపడకుండా యుద్ధభూమిలో తిరగడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. కాగా, ఈ యుద్ధం తర్వాత రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్టు ఉక్రెయిన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.