ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్ రాష్ట్రంలోని మోను జిల్లా థిరు, ఒటింగ్ గ్రామాల్లో తీవ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. అలాగే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ పౌరులపై భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపారంటూ స్థానికులు ఆరోణలు చేస్తున్నారు.