లండన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రష్యా సైనిక నేరాలపై స్పందించారు. సంఘర్షణ సమయంలో జరుగుతున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం మాట్లాడారు. లండన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
యుద్ద సమయంలో లైంగిక వేధింపులు అనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. మృగాళ్లలా ప్రవర్తించారని ఆరోపించారు. యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా వుండే అవకాశం వుండదని.. ఆ అవకాశాన్ని అదనుగా తీసుకుని మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారని ఒలెనా ఆవేదన వ్యక్తం చేశారు.