జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఇది ఒక భయానక ఘటనగా అభివర్ణించింది. నిందితులపై భారత అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అధికార ప్రతినిధి స్టెఫానే డుజరిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి వచ్చిన కథనాలు తమను కదిలించాయని వారు పేర్కొన్నారు. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో హింసించి.. చంపిన మానవమృగాలను క్షమించకూడదని, తక్షణమే నిందితులను ఉరి తీసి.. చిన్నారి అసిఫా ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నట్లు తన సందేశంలో గుటె రస్ తెలిపారు.