లాడెన్‌కు ఆర్థిక సాయం చేసిన 'ఇండియన్ బ్రదర్'...

గురువారం, 21 మే 2015 (18:12 IST)
అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌‌కు ఓ భారతీయుడు ఆర్థిక సాయం చేశాడట. పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో లాడెన్‌ను కాల్చి చంపాక యూఎస్ నేవీ సీల్స్‌ అక్కడి నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా  లభ్యమైన ఓ 'స్ప్రెడ్ షీట్' కీలకమైన విషయాన్ని బయటపెట్టింది. 
 
మదీనాలోని ఓ భారతీయుడు లాడెన్‌కు ఆర్థిక సాయం అందజేసిన వివరాలు అందులో ఉన్నాయి. లాడెన్ అతడిని 'ఇండియన్ బ్రదర్ ఇన్ మదీనా'గా పేర్కొనడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. 2009 మే, జులై మాసాల మధ్య ఆ 'ఇండియన్ బ్రదర్' లక్షల రూపాయలు లాడెన్‌కు పంపినట్టు వెల్లడైంది. 
 
అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్‌కు చెందిన మద్దతుదారుల నుంచే భారీ మొత్తాల్లో సొమ్ము అల్ ఖైదాకు అందినట్టు యూఎస్ మెరైన్లు స్వాధీనం చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి