కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

డీవీ

శుక్రవారం, 17 మే 2024 (19:34 IST)
Kalki new poster
ప్రభాస్ చిత్రం కల్కి2898 ఏ. డి (Kalki 2898AD) నుంచి డిఫరెంట్ శైలిలో ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నారు. ఇాదివరకు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి వారి లుక్ లను విడుదలచేసిన టీమ్ ఈసారి భైరవ వెహికల్ బుజ్జి రోల్ ను రేపు సాయంత్రం 5:00 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేసింది.  స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట వీడియో రిలీజ్ కానుందని కూడా తెలిపారు.
 
ఇలా వైవిధ్యమైన ప్రమోషన్ తో మరింత ఆకట్టుకునే కల్కి సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు. మైథాలాజీ సైన్స్ ఫిక్షన్ మూవీ గా రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ వంటి సీనియర్స్ నటిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు