అమెరికా కోవిడ్ విజృంభణ.. 11లక్షలు చేరిన మృతుల సంఖ్య

గురువారం, 22 డిశెంబరు 2022 (09:45 IST)
కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చైనాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అమెరికాలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితమైన దేశం అమెరికా. కరోనా బారిన పడిన వారి సంఖ్య 10 కోట్లు దాటింది. 
 
తాజాగా బుధవారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ సోకిన వారి సంఖ్య 10 కోట్ల 7 వేల 330లను తాకింది. అలాగే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు సరిగ్గా 10 లక్షల 88 వేల 280 మంది అక్కడ మరణించారని.. యూఎస్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనా డేటా సెంటర్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు