జిత్తుల మారి చైనా తన వైఖరిలో మార్పు చేసుకొనే ఉద్దేశ్యం కనిపించడం లేదు. ఇప్పటికే అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటుండగా డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అణ్వాయుధాల కర్మాగారంగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని అధిగమించేందుకు చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాల ఏర్పాట్లకు సిద్ధమవుతుండగా.. ఇది అమెరికాకే ప్రమాదం అనుకుంటే.. భారత్‌కు మరీ ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుంది.
చైనా నిర్మిస్తున్న అత్యధునాతనమైన డీఎఫ్-41 అనే పేరున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాలను ఉపయోగించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. డీఎఫ్-41 క్షిపణుల పరిధి 15,000 కిలోమీటర్లు కాగా ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయినా ఇవి ధ్వంసం చేయగలవు.