దీనికి తోడు పెచ్చులు ఊడిపోయిన ప్రాంతంలోంచి పాములు కూడా తొంగి చూస్తున్నాయి. ఊడిపోయిన పెచ్చుల్లోంచి పాములు ఇంటిలోపలికి వేలాడుతున్నాయి. సీలింగ్‌లో ఉన్న ఎలుకల్ని తినటానికి పాములు వచ్చాయి. వాటిని చూసిన హ్యారీ దంపతులు హడలిపోయారు. దీంతో హ్యారీ ఇంటి ఓనర్ వద్దకు పరిగెత్తాడు. జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పాములను తీయించమని మొరపెట్టుకున్నాడు.