ఆక్సిజన్ అందక చనిపోతే అవి ప్రభుత్వ హత్యలే...

ఆదివారం, 23 మే 2021 (17:19 IST)
ఆక్సిజన్ అందక మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆక్సిజన్ అందక చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, కరోనా నియంత్రణలో వైసీపీ సర్కార్ విఫలమైందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. తాము సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకోలేదని, పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. 
 
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడంలో ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో సర్కార్ శ్రద్ధ వహించాలని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు