తమ దేశంలో ఉన్నత విద్యాభ్యాసం చేసే విదేశీ విద్యార్థులకు అమెరికా చట్టసభ సభ్యులు ఓ విజ్ఞప్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన చట్ట సభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వదేశాలను వెళ్లాల్సిందేనని వారు కోరుతున్నారు. ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు కోరుతున్నారు.
ఓపీటీ వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. విదేశీ విద్యార్థులు తక్కువ వేతనాలకు లభిస్తుండటంతో అమెరికాలోని వ్యాపార సంస్థలు వారికే ఉద్యోగాలిస్తున్నాయని, స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని వారు ఆరోపించారు.