ఉగ్రవాదులకు సంపుష్టిగా ఆర్థిక వనరులు సమకూర్చుతున్న పాకిస్థాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసిన మోడీ.... పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తగిన బుద్ధి చెప్పారు.
తాజాగా పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఉగ్రవాదుల ఆర్థిక వనరులకు గండికొట్టి మరణశాసనం లిఖించారు. భారతలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌లో ముద్రించిన భారత నకిలీ కరెన్సీయే ప్రధాన ఆదాయవనరుగా ఉంది. ప్రధానంగా భారత - బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా ఈ డబ్బును భారతలోకి ఎఫ్‌ఐసీఎన్ చొప్పిస్తోందని, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఈ నోట్లను విరివిగా చలామణిలోకి తెస్తోందని వివరించాయి. గడిచిన ఒకటిన్నరేళ్లలోనే ఈ సరిహద్దుల రూ.70 కోట్ల వరకూ పాక్‌లో ముద్రించిన నకిలీ కరెన్సీ వస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మోడీ నిర్ణయం ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు చావుదెబ్బేనని అంటున్నాయి. కొత్తగా విడుదల చేసిన రూ.500, రూ.2 వేల నోట్లు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని, వాటిని కాపీ కొట్టడం పాకిస్థాన్‌కు అసాధ్యమని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డీఆర్‌ఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.