డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ఢీ. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం కురిసింది. విష్ణు మంచు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఢీ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.