గత ఏడాది భారతీయ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ హతమైన సంగతి తెలిసిందే. అమెరికాలోని కాన్సాస్‌లోని ఓ క్లబ్‌లో శ్రీనివాస్ ఓ దుండగుడి కాల్పులకు హతమైనాడు. ఈ నేపథ్యంలో కూచిభొట్ల శ్రీనివాస్ భార్యకు అమెరికా ఆహ్వానం పంపింది. ఈ నెల 30న అమెరికాలో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రెస్ కార్యక్రమంలో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్ యోడర్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలోని తన స్నేహితులు, కుటుంబీకుల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తోందని తెలిపారు. వలసదారులపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో సునయనకు ట్రంప్ వర్గం నుంచి ఆహ్వానం రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా కూచిబొట్ల శ్రీనివాస్ వర్థంతి సందర్భంగా సునయన త్వరలో భారత్ రాబోతున్నారు.