యువతి అదృశ్యం కానీ... ఆమె ఏటీఎం నుంచి డబ్బు డ్రా... ఎలా?

శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (10:48 IST)
ఓ యువతి కనిపించకుండా పోయింది. కానీ ఆ యువతి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయి. ఇది పోలీసులకు చిక్కు ప్రశ్నగా మారింది. ఒక్కొక్క ఏటీఎం నుంచి ఒక్కో సారి డబ్బులు డ్రా అవుతున్నాయి. చివరకు ఏటీఎం వినియోగిస్తున్న యువతి అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన జోడీ మేయర్స్ అనే యువతి ఈ యేడాది ఆగస్టు 26న కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మేయర్స్ ఆగస్టు 26న ఇంటి నుంచి బయలు దేరేముందు తన జీవిత భాగస్వామి నెయిల్ అర్చర్తో వెళ్లింది. ఆ తరువాత  కనిపించకుండా పోయింది. అయితే పోలీసులు ఆమె చనిపోయి ఉంటుందనే భావనకు వచ్చారు. 
 
అయితే అనుకోకుండా మార్గరెట్ ఆర్చర్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచే వారికి అనుమానం మరిం పెరిగింది. అదృశ్యమైన మరుసటి రోజే ఆ అమ్మాయికి చెందిన బ్యాంక్ ఎస్ఏ ఏటీఎం కార్డు ద్వారా మార్గరెట్ ఆర్చర్ (55) అనే మహిళ డబ్బులు డ్రా చేసింది.
 
మార్గరెట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏటీఎం ఎలా వచ్చింది. దాని పిన్ నంబర్ ఎలా తెలిసింది వంటి కోణంలో దర్యాప్తు జరిపారు. ఆమె హత్యచేసి ఇవన్నీ పొందారా.. లేక భర్తతో పాటు వెళ్ళడంతో అతని పాత్ర కూడా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి