నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. క్షణికావేశం దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మహిళకు ప్రస్తుతం 64ఏళ్లు. ఆమె తల్లికి 93ఏళ్లు కాగా.. ఫిబ్రవరిలో ఆమె మృతి చెందింది. అయితే.. ఆ విషయాన్ని తన కూతురు బయట పెట్టలేదు. ఆమె చనిపోయిన విషయాన్ని దాచి.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చింది.