ఆప్ఘనిస్థాన్‌లో జనం జడుసుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండ్రోజులకు తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ న్యూస్ యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది్ట. ఆ యాంకర్ ప్రస్తుతం అరెస్టయినట్లు తెలుస్తోంది.
అదీ కూడా ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యి ప్రసారం జరిగాక ఆ యాంకర్ మాయం అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆ మహిళా యాంకర్ దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మహిళలకు ఆఫ్ఘన్లో రక్షణ లేదని, తాలిబన్లు చెప్పిన మాటపై నిలబడతారనే గ్యారెంటీ లేదని, అందుకే తాను దేశం విడిచి వెళ్లినట్టు సీఎన్ఎన్కు తెలిపింది.