ఉన్నట్టుండి ఓ మహిళ ఖాతాలో 134 మిలియన్లు వచ్చి చేరింది. ఇది క్రిస్మస్ అద్భుతం అని ఆమె భావించింది. డల్లాస్‌కు చెందిన రూత్ బలూన్ అనే మహిళ.. సెకన్లలో మిలీయనీర్ అయ్యింది. కానీ అది స్వల్పకాలికమే. రూత్ బెలూన్ ఖాతాలో డబ్బు అనుకోకుండా బదిలీ చేయబడిందని బ్యాంక్ చెప్పింది. దీంతో ఆమె షాక్ కాలేదు. అది తన డబ్బు కాదని తనకు బాగా తెలుసునంటోంది. కానీ కొద్ది సేపు ఆశ్చర్యపోయానని మాత్రం వెల్లడించింది.
ఇంకా రూత్ బెలూన్ మాట్లాడుతూ.. గత వారం తన బ్యాంక్ ఖాతా 37 మిలియన్ డాలర్లు పెరిగినపుడు క్రిస్మస్ అద్భుతమని భావించానంది. గత మంగళవారం సాయంత్రం తాను బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంటే 37 మిలియన్ డాలర్ల ఆకుపచ్చ రంగును గమనించానని 35 ఏళ్ల రూత్ బెలూన్ తెలిపింది. వెంటనే తన భర్త బ్రియాన్‌ను పిలిచానని.. మొదట ఇది ఒక స్కామ్ అని భావించామని.. అయితే బ్యాంక్ అనుకోకుండా బదిలీ చేసిందని తెలిసి కామ్‌గా వుండిపోయామని చెప్పింది.
ముందుగా "ఎవరో మాకు నిజంగా బహుమతిగా ఇచ్చారని నేను ఆశించాను, నేను మిలియనీర్, నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలను. ఇది పెద్ద కథ" అని బెలూన్ వ్యాఖ్యానించింది. అంతటితో ఆగకుండా స్వల్పకాలంలో లక్షాధికారి అయిన రూత్ ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో అప్పటికే ప్లాన్ చేసింది. ఆ మొత్తంలో కొంత విరాళంగానూ.. మరికొంత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టాలనుకున్నానని చెప్పింది. అయినప్పటికీ, "ఈ మొత్తం నిజమైన బదిలీ అయినప్పటికీ, డబ్బు మాకు చెందినది కాదని నాకు తెలుసు'' అని రూత్ ఆమె స్పష్టం చేసింది