ఆడవాళ్లు పుల్ల ఐస్ క్రీమ్ తింటున్నట్లు ప్రకటన, స్త్రీలు ఆ పని చేయరాదంటూ నిషేధం

శనివారం, 6 ఆగస్టు 2022 (20:18 IST)
ఐస్ క్రీములు రకరకాలుగా వుంటాయి. పుల్ల ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, పేపర్ గ్లాస్ ఐస్ క్రీమ్... ఇలా రకరకాలుగా వుంటాయి. ఐతే మహిళలు ఐస్ క్రీములు తింటున్నట్లు ఇకపై ప్రకటనల్లో నటించరాదని ఓ దేశం నిషేధం విధించింది. దీనికి కారణం ఏమిటో వివరించింది.

 
మహిళలు పుల్ల ఐస్ క్రీములు తింటున్నట్లు ఈమధ్య కాలంలో ఇరాన్ దేశంలో రెండు ప్రకటనలు విడుదలయ్యాయి. అందులో హిజాబ్ నిర్లక్ష్యం చేస్తూ ఐస్ క్రీమ్ తింటున్నారనీ, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపెట్టారని ఇరాన్ మతపెద్దలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఐస్ క్రీములు తయారు చేసే డొమినోపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసారు.

 
దీనితో ఇరాన్ సాంస్కృతిక శాఖ స్పందించింది. ఇకపై మహిళలు ఇలాంటి ప్రకటనల్లో నటించరాదంటూ ఆదేశించింది. మహిళలను కించపరిచేవిధంగా ఎలాంటి ప్రకటనలు చేయరాదని హుకుం జారీ చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు