ఒబామా, హిల్లరీ మధ్య విభేదాలున్నాయా?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఒకనాటి అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థులు. అధ్యక్ష పీఠం కోసం డెమొక్రాట్ పార్టీ తరపున వీరిద్దరూ హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే చివర్లో విజయం బరాక్ ఒబామాను పలకరించడం, ఆయన ఆ బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.

ఆయన ఎన్నికల ప్రత్యర్థి ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి ఇదే అంశం తెరపైకి వచ్చింది. అమెరికా విదేశీ విధానాలపై హిల్లరీ, ఒబామా మధ్య విభేదాలు ఉన్నాయని ఆ దేశ మేగజైన్ ఒకటి శుక్రవారం పేర్కొంది.

హిల్లరీ క్లింటన్ ఇటీవలి అమెరికా, థాయ్‌లాండ్ దేశాల పర్యటన కూడా అధ్యక్ష నివాసంతో సంబంధం లేకుండా చేపట్టినట్లు ఫోర్బ్స్ కాలమిస్ట్ గోర్డాన్ జి చాంగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా చైనాకు సంబంధించిన విషయాల్లో హిల్లరీ క్లింటన్ వద్ద మెరుగైన విధానాలు ఉన్నట్లు చాంగ్ భావిస్తున్నారు. ఇటీవల భారత్, థాయ్ పర్యటనల్లో హిల్లరీ ఎక్కువ సమయాన్ని సంబంధాలను పటిష్ట పరుచుకునే కార్యక్రమాలకు కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి